యాపిల్ హాలిడే సేల్ను మిస్ అయ్యారా? ఆందోళన అవసరం లేదు. జియోమార్ట్ ఇప్పుడు ఐఫోన్ ప్రేమికుల కోసం అత్యంత లాభదాయకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) (128బీజీ)మోడల్ ఇప్పుడు జియోమార్ట్లో కేవలం రూ.65,990లకే లభిస్తోంది.
ఐఫోన్ 16 ప్లస్ 128బీజీ వేరియంట్ అసలు ధర రూ.89,900 కాగా నేరుగా రూ. 23,910 తగ్గింపు అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ కో-బ్రాండెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ (EMI) లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ (రూ.1,000 వరకు) లభిస్తుంది. తద్వారా ఫోన్ ధర రూ.64,990 లకు తగ్గుతుంది.
అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత అదనపు తగ్గింపు పొందవచ్చు. యాపిల్ అధికారికంగా ఐఫోన్ 17 (iPhone 17) విడుదల నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ ధరను తగ్గించినప్పటికీ, జియోమార్ట్ ధరలు అధికారిక స్టోర్ సవరించిన ధర రూ.79,900 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్ ప్రధాన స్పెక్స్
డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్
ప్రాసెసర్: యాపిల్ ఏ18 చిప్, 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ
కెమెరా సెటప్: 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 2x ఆప్టికల్ క్వాలిటీ టెలిఫోటో జూమ్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా త్వరిత యాక్సెస్
బ్యాటరీ: 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
డిజైన్: అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్
కలర్ ఆప్షన్లు: బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్
స్టోరేజ్ ఆప్షన్లు: 128GB / 256GB / 512GB


