జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్ | Jet Airways discount offer | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

Aug 10 2015 11:51 PM | Updated on Sep 3 2017 7:10 AM

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ డిస్కౌంట్ ఆఫర్

మంచి పనితీరు, పలు రకాల ఆఫర్లతో వృద్ధి బాటలో పయనిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మరో డిస్కౌంట్ ఆఫర్‌కు తెరతీసింది...

న్యూఢిల్లీ: మంచి పనితీరు, పలు రకాల ఆఫర్లతో వృద్ధి బాటలో పయనిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మరో డిస్కౌంట్ ఆఫర్‌కు తెరతీసింది. ఇందులో భాగంగా కంపెనీ ప్రయాణికులకు ఫస్ట్, బిజినెస్, ఎకానమీ వంటి అన్ని తరగతుల టికెట్ ధరల్లో 30 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు ఆగస్ట్ 10 నుంచి 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ దేశీ, విదేశీ సర్వీసులకు వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement