జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురు దెబ్బ | Jet Airways CEO Vinay Dube Resigns | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురు దెబ్బ

May 15 2019 9:22 AM | Updated on May 15 2019 9:51 AM

Jet Airways CEO Vinay Dube Resigns  - Sakshi

వినయ్‌ దుబే (పైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై :  రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు  మరో ఎదురు దెబ్బ తగిలింది.  విమాన సర్వీసులను పూర్తి నిలిపివేసిన అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి వరుసగా కీలక ఉద్యోగులు తప్పుకుంటున్నారు. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో  వినయ్‌ దుబే రాజీనామా  చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా  కంపెనీనుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు.

మంగళవారం కంపెనీ డిప్యూటీ సీఈవో,  సిఎఫ్ఓ అమిత్ అగర్వాల్ కంపెనీ నుంచి వైదొలగారు.  ఒకవైపు వాటాల కొనుగోలు సంబంధించిన  అంశం ఇంకా కొలిక్కి రావడంలేదు. మరోవైపు వరుసగా  కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి గుడ్‌బై  చెపుతున్నారు. ముఖ్యంగా  ఇపుడు సీఈవో రాజీనామా చేయడం  కీలక పరిణామం.   కాగా ఆగష్టు 8, 2017న  జెట్‌కు సీఈవోగా వినయ్ దుబే నియమితులయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement