రోహిత్‌తో జతకట్టిన జపాన్‌ నెం.1 బ్రాండ్‌ | Japan No 1 Brand SHARP Signs Rohit Sharma As Ambassador | Sakshi
Sakshi News home page

రోహిత్‌తో జతకట్టిన జపాన్‌ నెం.1 బ్రాండ్‌

Jun 22 2018 8:56 PM | Updated on Jun 22 2018 8:58 PM

Japan No 1 Brand SHARP Signs Rohit Sharma As Ambassador - Sakshi

షార్ప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

దేశీయ టీవీ మార్కెట్‌లో మరో దిగ్గజ కంపెనీ ప్రవేశించబోతుంది. జపాన్‌కు చెందిన నెంబర్‌ 1 బ్రాండ్‌ ‘షార్ప్‌ టీవీ’ భారత్‌లో గ్రాండ్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ రోహిత్‌ శర్మతో ఆ బ్రాండ్‌ అసోసియేట్‌ అయింది. భారత్‌లో క్రికెట్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకుని, రోహిత్‌ శర్మను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. రోహిత్‌ శర్మతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా గర్వంగా ఉందని, భారత క్రికెట్‌ టీమ్‌లో ఆయన టాప్‌ ప్లేయర్‌ అని, స్థిరంగా తన ప్రతిభను కనబరుస్తాడని పేర్కొంది. 

రోహిత్‌ భాగస్వామ్యం, భారత్‌లో తమ బ్రాండ్‌ను గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు ఎంతో సహకరిస్తుందని షార్ప్‌ టీవీ ఇండియా సేల్స్‌ డైరెక్ట్రర్‌ జేమ్స్‌ యాంగ్‌ చెప్పారు. రోహిత్‌కు ఎక్కువ సంఖ్యలో అభిమానులున్నారన్నారు. ఆక్వాస్‌ ఎల్‌ఈడీ టీవీలను లాంచ్‌ చేస్తూ.. ఈ కంపెనీ భారత టీవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తోంది. షార్ప్‌తో భాగస్వామ్యంపై మాట్లాడిన రోహిత్‌.. షార్ప్‌ లాంటి బ్రాండులతో భాగస్వామ్యం అవడం ఎంతో ఆనందదాయమని, టెక్‌ ఔత్సాహికుడిగా.. బ్రాండ్‌ను తాను ప్రేమిస్తున్నానని చెప్పారు. తాను చూసే ఏ కంటెంటైనా స్పోర్ట్స్‌ లేదా మూవీలు ఇలా వేటినైనాన షార్ప్‌లో చూడటమే బెస్ట్‌ అని తనకు తెలుసన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement