ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే | It may take ATMs three months to dispense Rs 200 notes | Sakshi
Sakshi News home page

ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే

Sep 4 2017 1:17 AM | Updated on Sep 17 2017 6:20 PM

ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే

ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే

ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన రూ.200 నోట్లు ఏటీఎం మెషిన్లలోకి రావడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలల వరకు సమయం పట్టేట్టు ఉంది.

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన రూ.200 నోట్లు ఏటీఎం మెషిన్లలోకి రావడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలల వరకు సమయం పట్టేట్టు ఉంది. రూ.200 నోట్లు పట్టే విధంగా ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కొత్త రూ.200 నోటుకు అనుగుణంగా ఏటీఎం యంత్రాల్లో మార్పులు చేయాలంటూ ఆర్‌బీఐ నుంచి తమకు ఆదేశాలేవీ రాలేదని ఏటీఎం నిర్వహణా కంపెనీలు అంటున్నాయి. కొన్ని బ్యాంకులు అనధికారికంగా కొత్త నోటుకు అనుగుణంగా మార్పులు చేసి చూడాలని కోరినట్టు తెలిపాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2.25 లక్షల ఏటీఎంలలోనూ మార్పులు చేయాలా? అన్నదానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు.

Advertisement
 
Advertisement
Advertisement