భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు’

International threat to India Says YV Reddy - Sakshi

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్‌ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ప్రభావం చమురు లభ్యత, నిధుల ప్రవాహానికి అవరోధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భారత్‌కు స్వల్ప కాలానికి హాని కలుగజేసే సమస్యలే. అంతర్జాతీయ వ్యాపారంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై యూఎస్‌ఏ ఆధిపత్యం ఉంది. ఇది కూడా అంతర్జాతీయ సంఘర్షణకు ఒక కారణం. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం నడుస్తోంది. యూఎస్‌లో వినియోగం కోసం ఉన్న యూఎస్‌ డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా వాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top