18న ఐనాక్స్ విండ్ ఐపీఓ | Inox Wind IPO opens on Mar 18; price band at Rs 315-325 | Sakshi
Sakshi News home page

18న ఐనాక్స్ విండ్ ఐపీఓ

Mar 12 2015 2:32 AM | Updated on Aug 21 2018 2:28 PM

18న ఐనాక్స్ విండ్ ఐపీఓ - Sakshi

18న ఐనాక్స్ విండ్ ఐపీఓ

విండ్ విద్యుత్తుకు సంబంధించిన సర్వీసులందజేసే ఐనాక్స్ విండ్ సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 18న ఆరంభం కాబోతోంది.

20న ముగింపు
ప్రైస్‌బాండ్ రూ.315-రూ.325
ముంబై: విండ్ విద్యుత్తుకు సంబంధించిన సర్వీసులందజేసే ఐనాక్స్ విండ్ సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 18న ఆరంభం కాబోతోంది. ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాడ్‌గా రూ.315-325 ధరలను నిర్ణయించామని గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ డెరైక్టర్ దీపక్ ఆషర్ చెప్పారు.

రూ.700 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఐనాక్స్ విండ్ ప్రమోటర్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్‌కు ఉన్న 5 శాతం వాటాను (కోటి ఈక్విటీ షేర్లు) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నామని, ఈ ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని భావిస్తున్నామని తెలిపారు. షేర్ ముఖ విలువ రూ.10 అని కనిష్టంగా 45 షేర్లకు బిడ్‌లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. కంపెనీ విస్తరణకు, దీర్ఘకాల మూలధన అవసరాలు, తమ అనుబంధ సంస్థ ఐనాక్స్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌లో పెట్టుబడులకు ఈ ఐపీఓ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement