సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఇంజనీరింగ్‌లో ఉద్యోగులకు శిక్షణ

Infosys to train employees in self-driving car engineering   - Sakshi

సాక్షి, బెంగళూరు:   దేశీయ  ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌  తమ ఉద్యోగులకు సెల్ఫీ డ్రైవింగ్‌ కార్‌ ఇంజనీరింగ్‌పై గ్లోబల్‌ శిక్షణా సంస్థ ఆధర్వంలో  ట్రైనింగ్‌ ఇప్పించేందుకు సిద్ధమవుతోంది.   ఈ మేరకు అమెరికాకు చెందిన ఐటి ఆన్‌లైన​ లెర్నింగ్ సంస‍్థ ఉడాసిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  సెల్ఫీ డ్రైవింగ్‌ కార్‌ ఇంజనీరింగ్‌ పై  ఉద్యోగుల్లో  నైపుణ్యాలను పెంపొందించేందుకు  ఆన్ లైన్ నానో డిగ్రీ శిక్షణకు శ్రీకారం చుట్టింది.

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు ఉడాసిటీ   ఉడాసిటీ కనెక్ట్‌ పేరుతో అందిస్తున్న  నానో డిగ్రీ శిక్షణ 20వారాలు పాటు కొనసాగుతుంది.   దీని ద్వారా 2018 నాటికి సుమారు 500మందికి  సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌పై అత్యాధునిక తర్ఫీదు నివ్వనుంది. ముఖ్యంగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్,  అటానమస్ టెక్నాలజీస్‌లోతమ ఉద్యోగుల నైపుణ్యాల పునరుద్ధరణకు తాము  కట్టుబడి ఉన్నామని  ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌,  డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్   రవి కుమార్  తెలిపారు.  ఉడాసిటీతో భాగస్వామ్యం తమకు గర్వకారణమనీ.. తద్వారా  నూతన ఆవిష్కరణలోల తాము ముందం‍జలో ఉన్నామనే   నమ్మకాన్ని తమ ఖాతాదారులకు  అందించనున్నట్టు ఆయన చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top