రూ.999కే విమాన టికెట్‌

Indigo Announce Valentine Offer on Ticket Prices - Sakshi

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ వెల్లడించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top