ఢిల్లీ-వైజాగ్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్ సర్వీస్ | Indigo Airlines Non-Stop Services | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-వైజాగ్ మధ్య ఇండిగో నాన్‌స్టాప్ సర్వీస్

Oct 10 2014 1:03 AM | Updated on Sep 2 2017 2:35 PM

ఇండిగో విమానయాన సంస్థ దేశీయ నెట్‌వర్క్‌లో 10 కొత్త డైలీ నాన్-స్టాప్ విమాన సర్వీసులను నేటి నుంచి అందించనున్నది. హైదరాబాద్, వైజాగ్, గోవా, ఢిల్లీ, బెంగళూరులకు నాన్‌స్టాప్ సర్వీసులు ఉంటాయని ఇండిగో తెలిపింది.

న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థ దేశీయ నెట్‌వర్క్‌లో 10 కొత్త డైలీ నాన్-స్టాప్ విమాన సర్వీసులను నేటి నుంచి అందించనున్నది.  హైదరాబాద్, వైజాగ్, గోవా, ఢిల్లీ, బెంగళూరులకు నాన్‌స్టాప్ సర్వీసులు ఉంటాయని ఇండిగో తెలిపింది. నేటి(శుక్రవారం) నుంచి ఢిల్లీ-వైజాగ్ నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని పేర్కొంది. అలాగే  హైదరాబాద్-వైజాగ్‌ల మధ్య మూడవ డైలీ నాన్‌స్టాప్ విమాన సర్వీసును,  ముంబై-హైదరాబాద్‌ల మధ్య 6వ నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందిస్తున్నామని తెలిపింది.

అలాగే ఈనెల 26 నుంచి ఢిల్లీ-గోవా నాలుగవ డైలీ నాన్‌స్టాప్  విమాన సర్వీస్‌ను, ఢిల్లీ-బెంగళూరు 9వ డైలీ నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను ప్రారంభిస్తామని పేర్కొంది. ఢిల్లీ-విశాఖ  డైలీ నాన్-స్టాప్ సర్వీస్‌ను తొలిసారిగా ప్రారంభిస్తున్నామని,  ప్రయాణికులు అదే రోజు ఆంధ్రప్రదేశ్‌కు రిటర్న్ జర్నీ చేయవచ్చని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై పన్నులు తగ్గించిందని, ఫలితంగా తక్కువ చార్జీలు ఆఫర్ చేసే అవకాశాలున్నాయని, కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఇండిగో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement