ఖతార్ వరల్డ్ కప్ స్టేడియంఎల్ అండ్ టీకి కాంట్రాక్ట్ | India's L&T wins $135m stadium contract for Qatar's Fifa World Cup 2022 | Sakshi
Sakshi News home page

ఖతార్ వరల్డ్ కప్ స్టేడియంఎల్ అండ్ టీకి కాంట్రాక్ట్

Jun 7 2016 12:49 AM | Updated on Oct 16 2018 5:04 PM

ఖతార్ వరల్డ్ కప్ స్టేడియంఎల్ అండ్ టీకి కాంట్రాక్ట్ - Sakshi

ఖతార్ వరల్డ్ కప్ స్టేడియంఎల్ అండ్ టీకి కాంట్రాక్ట్

ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియమ్ నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది.

దోహ/న్యూఢిల్లీ: ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన  స్టేడియమ్ నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.  ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది.   ప్రస్తుతం ఎల్ అండ్ టీ  కంపెనీ దోహలో మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

 రూ.2,161 కోట్ల ఆర్డర్లు
లార్సెన్ అండ్ టుబ్రో రూ.2,161 కోట్ల విలువైన ఆర్డర్లను సాధించింది.  డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రూ.847 కోట్ల ఆర్డర్‌ను తమ రవాణా ఇన్‌ఫ్రా వ్యాపార ం సాధించిందని ఎల్ అండ్ టీ తెలిపింది. అలాగే గుజరాత్ వాటర్ ఇన్‌ఫ్రా, రాజస్థాన అర్బన్ డ్రింకింగ్ వాటర్ సీవరేజ్ అండ్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ల నుంచి రూ.709 కోట్ల విలువైన ఆర్డర్లు తమ వాటర్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ బిజినెస్‌కు లభించాయని పేర్కొంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కర్నాటక సోలార్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల నుంచి రూ.403 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్లను తమ పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సాధించిందని తెలిపింది. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యాపార విభాగానికి  రూ.202 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement