భారత్‌ బ్యాంకింగ్‌కు కష్టకాలమే! | 'Indian banks take more risk during upturn in credit growth' | Sakshi
Sakshi News home page

భారత్‌ బ్యాంకింగ్‌కు కష్టకాలమే!

Dec 17 2016 2:08 AM | Updated on Sep 4 2017 10:53 PM

భారత్‌ బ్యాంకింగ్‌కు కష్టకాలమే!

భారత్‌ బ్యాంకింగ్‌కు కష్టకాలమే!

భారత్‌ బ్యాంకింగ్‌కు రానున్నది కష్టకాలమేనని స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ– బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌)

బీఐఎస్‌ నిపుణుల అభిప్రాయం  
న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌కు రానున్నది కష్టకాలమేనని స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ– బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) విడుదల చేసిన ఒక వర్కింగ్‌ పేపర్‌ అభిప్రాయపడింది. ప్రత్యేకించిరుణ వృద్ధి సమయంలో బ్యాంకులకు మూలధనం విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. మూలధనం తగిన స్థాయిలో ఉన్న బ్యాంకుల విషయంలో మాత్రం ఇబ్బందులు కొంత తక్కువగాఉంటాయని తెలియజేసింది.

ఇక ప్రైవేటు రంగం విషయంలో మొండిబకాయిల సమస్యను నివేదిక ప్రస్తావిస్తూ... వడ్డీరేట్ల మార్పుల సందర్భాల్లో ఆయా ప్రైవేటు బ్యాంక్‌ ద్రవ్య పరిస్థితులు ఒడిదుడుకుకు గురయ్యేవీలుందని అభిప్రాయపడింది. కాగా  వర్కింగ్‌ పత్రాన్ని ఆర్‌బీఐకి చెందిన పల్లవి చవాన్, బీఐఎస్‌లో ఆర్థిక నిపుణులు లియోనార్డో సంయుక్తంగా రూపొందించారు. విశ్లేషణాపత్రంలోని అభిప్రాయాలు కేవలం వీరిగానేభావించాలని బాసిల్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌– బీఐఎస్‌ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement