పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్! | India Post says keen to become a universal bank | Sakshi
Sakshi News home page

పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!

Nov 14 2014 1:33 AM | Updated on Sep 2 2017 4:24 PM

పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!

పూర్తి స్థాయి బ్యాంక్ హోదానే కోరుతున్న ఇండియా పోస్ట్!

ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ (యూనివర్సల్ బ్యాంక్) హోదానే....

ముంబై: ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ (యూనివర్సల్ బ్యాంక్) హోదానే కోరుకుంటోందని మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ బిషోయ్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇండియా పోస్ట్ పూర్తిస్థాయి బ్యాంక్ హోదానే కోరుకుంటున్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని అన్నారు.

 ఈ అంశం మాజీ క్యాబినెట్ సెక్రటరీ టీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ పరిశీలనలో ఉందని సైతం ఆయన అన్నారు. ఇండియా పోస్ట్‌కు కేవలం పేమెంట్ బ్యాంక్ హోదా ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో బిషోయ్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement