ఎగుమతులు.. 60 శాతం మైనస్‌ | India is exports contract 60persant in April | Sakshi
Sakshi News home page

ఎగుమతులు.. 60 శాతం మైనస్‌

May 16 2020 5:55 AM | Updated on May 16 2020 5:55 AM

India is exports contract 60persant in April - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం ఏప్రిల్‌ ఎగుమతులపై తీవ్రంగా పడింది. ఎగుమతుల్లో –60.28 శాతం క్షీణత నెలకొంది. ఇక దిగుమతులదీ అదే పరిస్థితి.  58.65 శాతం క్షీణించాయి. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదలచేసిన  గణాంకాల్లో ముఖ్యాంశాలు..

► ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ కేవలం 10.36 బిలియన్‌ డాలర్లు. 2019 ఇదే నెలలో ఈ విలువ 26 బిలియన్‌ డాలర్లు.

► ఇక దిగుమతుల విలువ 41.4 బిలియన్‌ డాలర్లు (2019 ఏప్రిల్‌) నుంచి తాజా సమీక్షా నెలలో 17.12 బిలియన్‌ డాలర్లకు పడింది.  

► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 6.76 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2019 ఇదే నెలలో ఈ వ్యత్యాసం 15.33 బిలియన్‌ డాలర్లు.  

► ఆభరణాలు(–98.74%), తోలు (–93.28%), పెట్రోలియం ప్రొడక్టులు(–66.22 శాతం), ఇంజనీరింగ్‌ గూడ్స్‌ (–64.76%) ఎగుమతులు భారీ క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి.  

► ఏప్రిల్‌లో మొత్తం దిగుమతుల విలువలో చమురు వాటా 4.66 బిలియన్‌ డాలర్లు. 2019 ఏప్రిల్‌తో పోల్చితే  విలువ 59.03% తక్కువ.  

► మార్చి నెలలో కూడా ఎగుమతుల విలువ 34.57 శాతం పడిపోయిన సంగతి గమనార్హం.  

► కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎగుమతుల విలువ 214.61 బిలియన్‌ డాలర్లని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2018–19తో పోల్చితే ఇది 4.3% పెరుగుదల. ఇక ఈ రంగం దిగుమతుల విలువ ఈ కాలం లో 131.56 బలియన్‌ డాలర్లు.  ఒక్క మార్చి నెలలో ఎగుమతులు 18.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా ఇదే నెలలో సేవల దిగుమతులు 11.11 బిలియన్‌ డాలర్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement