ఐకియా స్టోర్కు ఆగస్టు 11న శంకుస్థాపన | IKEA confirms plan for store in hyderabad | Sakshi
Sakshi News home page

ఐకియా స్టోర్కు ఆగస్టు 11న శంకుస్థాపన

Jul 13 2016 12:47 AM | Updated on Sep 4 2018 5:21 PM

ఐకియా స్టోర్కు ఆగస్టు 11న శంకుస్థాపన - Sakshi

ఐకియా స్టోర్కు ఆగస్టు 11న శంకుస్థాపన

రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న శంకుస్థాపన చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. హైటెక్ సిటీ సమీపంలో 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.685.5 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2017 వేసవిలోగా నిర్మాణం పూర్తి చేసి స్టోర్‌ను ప్రారంభించాలనేది కంపెనీ ప్రణాళిక. 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 ఔట్‌లెట్లను స్థాపించాలన్నది సంస్థ లక్ష్యం. భాగ్యనగరి సహా మొత్తం 9 నగరాల్లో ఇవి రానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement