అందరికీ బీమా రక్షణ: జైట్లీ | If LIC were listed, it would be the most valued company: Arun Jaitley | Sakshi
Sakshi News home page

అందరికీ బీమా రక్షణ: జైట్లీ

Sep 2 2016 1:51 AM | Updated on Oct 2 2018 5:51 PM

అందరికీ బీమా రక్షణ: జైట్లీ - Sakshi

అందరికీ బీమా రక్షణ: జైట్లీ

ఆర్థిక రంగం వేగంగా వృద్ధి చెందితే రానున్న రోజుల్లో దేశ ప్రజలందరికీ బీమా రక్షణ, సామాజిక భద్రత సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

ముంబై: ఆర్థిక రంగం వేగంగా వృద్ధి చెందితే రానున్న రోజుల్లో దేశ ప్రజలందరికీ బీమా రక్షణ, సామాజిక భద్రత సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఎల్‌ఐసీ గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నారు. గురువారం ముంబైలో ఎల్‌ఐసీ వజ్రోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. కార్మికులు శుక్రవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో జైట్లీ స్పందిస్తూ... బడ్జెట్ ప్రతిపాదన అరుున చందా ఆధారిత సామాజిక భద్రతా పథకాన్ని కార్మికుల డిమాండ్ మేరకు ఉపసంహరించుకున్నామని గుర్తు చేశారు.

 ఎల్‌ఐసీ భేష్ : దేశీయ బీమా రంగంలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచి 16 సంవత్సరాలు గడిచినా, పోటీ వాతావరణాన్ని తట్టుకుని ఎల్‌ఐసీ ఇప్పటికీ 70 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉండటాన్ని జైట్లీ ప్రశంసించారు. మార్కెట్ లీడర్‌గా ఉండేందుకు మరిన్ని వినూత్న బీమా ఉత్పత్తులు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో ఎల్‌ఐసీ పాత్ర కీలకమని, రూ.4 లక్షల కోట్లను వివిధ రంగాల్లో పెట్టబుడులు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు నిధుల్లోంచి కేంద్రానికి తమ వాటాగా రూ.2,502 కోట్ల చెక్‌ను ఎల్‌ఐసీ చైర్మన్  రాయ్ ఆర్థిక మంత్రికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement