ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు | IDBI Bank posts Rs 1736-crore loss for March quarter | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు

May 21 2016 2:29 AM | Updated on Sep 4 2017 12:32 AM

ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు

ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు

ఐడీబీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,736 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,736 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిల కేటాయింపులు రెండు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-14) ఇదే క్వార్టర్‌కు రూ.546 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీబీఐ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్ కారత్ చెప్పారు. 2014-15 క్యూ4లో రూ.9,382 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ,8,275 కోట్లకు తగ్గిందని తెలిపారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 0.47 శాతం క్షీణించి రూ.64.1 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement