ఐబాల్ నుంచి ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్ | iBall Slide i701 Windows 8.1 tablet launched at Rs 4999 | Sakshi
Sakshi News home page

ఐబాల్ నుంచి ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్

May 22 2015 1:56 AM | Updated on Sep 3 2017 2:27 AM

ఐబాల్ నుంచి ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్

ఐబాల్ నుంచి ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్

విద్యార్థులు, యువ నిపుణులు, తొలిసారి ట్యాబ్లెట్లను వినియోగిస్తున్న వారే లక్ష్యంగా ఐబాల్ కంపెనీ ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్‌ను...

ధర రూ.4,999
న్యూఢిల్లీ: విద్యార్థులు, యువ నిపుణులు, తొలిసారి ట్యాబ్లెట్లను వినియోగిస్తున్న వారే లక్ష్యంగా ఐబాల్  కంపెనీ ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘ఐబాల్ స్లైడ్ ఐ701’ట్యాబ్లెట్‌లో క్వాడ్‌కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఏడు అంగుళాల హెచ్‌డీ తెర, 16 జీబీ మెమరీ, 1జీబీ ర్యామ్, ప్లాష్‌తో కూడిన 2 ఎంపీ రియర్ కెమెరా, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ట్యాబ్లెట్లకు ఏడాదిపాటు 1 టెరా బైట్ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను, పలు యాప్స్‌ను ఉచితంగా ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement