breaking news
Windows Tablet
-
ఐబాల్ నుంచి ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్
ధర రూ.4,999 న్యూఢిల్లీ: విద్యార్థులు, యువ నిపుణులు, తొలిసారి ట్యాబ్లెట్లను వినియోగిస్తున్న వారే లక్ష్యంగా ఐబాల్ కంపెనీ ‘స్లైడ్ ఐ701’ విండోస్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘ఐబాల్ స్లైడ్ ఐ701’ట్యాబ్లెట్లో క్వాడ్‌కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఏడు అంగుళాల హెచ్డీ తెర, 16 జీబీ మెమరీ, 1జీబీ ర్యామ్, ప్లాష్‌తో కూడిన 2 ఎంపీ రియర్ కెమెరా, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ట్యాబ్లెట్లకు ఏడాదిపాటు 1 టెరా బైట్ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను, పలు యాప్స్‌ను ఉచితంగా ఇవ్వనుంది. -
‘జోలో’ విండోస్ ట్యాబ్ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెల్ ప్రాసెసర్‌తో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించి భారతీయ బ్రాండ్ జోలో... మరిన్ని సంచలనాలకు రెడీ అవుతోంది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను తయారు చేసి మార్కెట్లోకి తేబోతోంది. వీటి ధరలు రూ. 9-18 వేల మధ్య ఉండొచ్చునని కంపెనీ చెబుతోంది. ఈ నెల(జనవరి)లోనే విండోస్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తేనున్నట్లు కంపెనీ ఇండియా మార్కెటింగ్ హెడ్ రోహంత్ శ్యామ్ ‘సాక్షి’కి తెలియజేశారు. తద్వారా విండోస్ ఓఎస్‌తో మోడళ్లను తె చ్చిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలుస్తామన్నారు. విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా నాలుగు నెలల్లో విడుదల చేస్తామన్నారు. ఇంటెల్, క్వాల్కామ్, ఏఎండీ వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి కస్టమర్లకు అత్యాధునిక, వినూత్న స్మార్ట్ఫోన్లను అందిస్తామని, వీటి ధరలు రూ. 10 వేలు ఆైపై ఉంటాయని తెలియజేశారు. వేగవంతమైన ట్యాబ్లెట్... ఇటీవలే విడుదలైన ఏడంగుళాల జోలో ప్లే టెగ్రా నోట్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు శ్యామ్ చెప్పారు. ‘‘విడుదలైన వారంలోనే 5,000 పీసులు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ కోసం రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ ఉంది. దీనిక్కారణం ఈ ట్యాబ్లెట్‌ను ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎన్విడియా టెగ్రా 4 ప్రాసెసర్‌తో రూపొందిం చాం’’ అని ఆయన వివరించారు. వైఫైతో పనిచేసే ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో 1.8 జీహెచ్ క్వాడ్‌కోర్+1 కార్టెక్స్ ఏ15 సీపీయూ, 1 జీబీ రామ్, 16 జీబీ మెమరీ, 5 మెగాపిక్సెల్ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఎన్విడియా డెరైక్ట్ స్టైలస్ అదనపు ఆకర్షణ. ధర రూ.17,999. కాగా, 4జీ స్మార్ట్‌ఫోన్ ఎల్టీ900ను కంపెనీ మంగళవారం అధికారికంగా భారత్‌లో విడుదల చేసింది. ధర రూ. 17,999. కంపెనీ ఇప్పటికే 10 లక్షల స్మార్ట్ఫోన్లను భారత్‌లో విక్రయించింది. ఏడాదిలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 10% వాటా లక్ష్యంగా చేసుకున్నట్లు శ్యామ్ చెప్పారు.