హ్యుందాయ్‌ ఆరా వచ్చేసింది

Hyundai Launches Compact Sedan Aura - Sakshi

ధర రూ.5.79–9.22 లక్షల రేంజ్‌లో

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కంపెనీ కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సెగ్మెంట్లో అధికంగా అమ్ముడవుతున్న మారుతీ డిజైర్, హోండా అమేజ్‌లకు గట్టిపోటీనివ్వగలదని భావిస్తున్న ఆరా ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.9.22 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. బీఎస్‌ –6 నిబంధనలను పాటించే 1.2 లీటర్ల ఇంజిన్‌ సామర్థ్యంతో ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ ఎస్‌.ఎస్‌. కిమ్‌ తెలిపారు. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతమున్న తమ మోడల్‌ ఎక్సెంట్‌ పెద్దగా అమ్మకాలు సాధించడం లేదంటూనే... ఆరా మాత్రం మంచి అమ్మకాలు సాధించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ కారు 20 కిమీ, డీజిల్‌ కారు 25 కిమీ. మైలేజీనిస్తాయని తెలియజేశారు. ఈ కారులో వైర్‌లెస్‌ ఛార్జర్, డ్రైవర్‌ రియర్‌ వ్యూ మానిటర్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top