
జనవరి నుంచి హోండా కార్ల ధరలు అప్
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా.. జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.16,000 వరకు పెంచనున్నది.
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా.. జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.16,000 వరకు పెంచనున్నది. ఉత్పత్తి వ్యయం అధికమవ్వడమే కార్ల ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ తె లిపింది. జనవరి నుంచి మోడల్‌ను బట్టి కారు ధరను రూ.10,000-రూ.16,000 వరకు పెంచుతామని హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా రూ.4.25-రూ.25.13 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ధరల శ్రేణిలో తన వాహనాలను విక్రయిస్తోంది. టాటా మోటార్స్, మారుతీ, జనరల్ మోటార్స్, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కాగా నిస్సాన్, రెనో, స్కోడా కంపెనీలు కూడా కార్ల ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.