హోండా బీఎస్‌–6 డియో స్కూటర్‌

Honda BS6 Dio Scooter launch in Bangalore - Sakshi

ధరలు రూ.64,584 నుంచి ఆరంభం

బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీ డియో మోడల్‌లో బీఎస్‌–6 వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ ధరలు రూ.64,584(ఎక్స్‌ షోరూమ్, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లు–స్టాండర్డ్, డీలక్స్‌ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్‌ వన్‌  టూ వీలర్‌ బ్రాండని, ఈ ప్రాంతంతో తమ మార్కెట్‌ వాటా 34 శాతమని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top