హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌ | Home Credit India App | Sakshi
Sakshi News home page

హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌

May 8 2017 6:30 AM | Updated on Sep 5 2017 10:38 AM

హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌

హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌

ప్రముఖ కన్సూమర్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘హోమ్‌ క్రెడిట్‌’ తన పేరుతోనే ఒక యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ప్రముఖ కన్సూమర్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘హోమ్‌ క్రెడిట్‌’ తన పేరుతోనే ఒక యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఫైనాన్షియల్‌ సర్వీసులను సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ‘హోమ్‌ క్రెడిట్‌ ఇండియా’ అనే ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు...
♦  తీసుకున్న రుణాల వివరాలను ఎప్పటికప్పుడు పొందొచ్చు.
♦ లోన్‌ సమరీ, రి–పేమెంట్‌ షెడ్యూల్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ–మెయిల్‌ కూడా పంపుకోవచ్చు.
♦ ఇంకా ఎంత మొత్తం చెల్లించాలో చూసుకోవచ్చు. దాన్ని ఏ తేదీలోపు కట్టేయాలో కూడా తెలుసుకోవచ్చు.
♦  డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ఆప్షన్స్‌తో పేయూ ద్వారా ఈఎంఐ పేమెంట్స్‌ను వెంటనే కట్టేయవచ్చు.
♦  యూజర్‌కు సంబంధించిన మొబైల్‌ నెంబర్, ఈ–మెయిల్‌ వంటి తదితర వివరాలను అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
♦ లోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ మొబైల్‌కు ఓటీపీని పొంద టం ద్వారా యాప్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. తర్వాత యాప్‌లోకి మళ్లీ లాగిన్‌ అవ్వడం కోసం 4 డిజిట్ల పిన్‌ను సెట్‌ చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement