రెండు పాన్‌కార్డులు : జరిమానా

Holding multiple PAN cards? You may be fined Rs 10,000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌, పాన్‌ అనుసంధానం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఒక్కరే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి వుంటే ఆదాయ పన్నుశాఖ  కనిపెట్టేయడం చాలా సులువు.  అలాగే  మల్టీ పాన్‌ కార్డులను కలిగివుండటం నేరమని ఇప్పటికే ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది కూడా. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే.. పన్నులు ఎగవేసేందుకు, చాలామంది వ్యక్తులు అనుకోకుండా  బహుళ  పాన్‌కార్డులు కలిగి వుంటున్నారనీ ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. కారణం ఏదైనా కావచ్చు కానీ, ఇలా ఒకటి కంటే ఎక్కువపాన్ కార్డును కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 272బి ప్రకారం జరిమానా తప్పదని ఐటీ శాఖ తెలిపింది. ఇందుకు గాను 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. ఇలా ఎవరైనా  రెండు పాన్ కార్డులను కలిగి వుంటే  తక్షణమే  అదనంగా  ఉన్న ప్యాన్‌  కార్డులను ఆన్‌లైన్‌, లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా రద్దు చేసుకోవాలని ఆదాయ పన్నుశాఖ కోరింది.   ఈ నేపథ్యంలో  అదనంగా ఉన్న పాన్‌కార్డులను సరెండర్‌ చేయడం ఎలాగో ఒకసారి  చూద్దాం..

ఆన్‌లైన్‌ ద్వారా పాన్‌ సరెండర్‌ చేయడం
ఇందుకు  ఆదాయ పన్ను  శాఖ వెబ్‌సైట్‌ https://www.incometaxindia.gov.in. పేజీలోని  ఎడమ దిగువ భాగంలోని 'ముఖ్యమైన లింక్స్‌' విభాగానికి వెళ్లండి. అప్లయ్‌ ఫర్‌ పాన్‌ అనే బటన్‌ క్లిక్‌ చేయాలి.  ఇక్కడొక న్యూ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. UTITSL అనే లింక్‌  క్లిక్‌ చేసి సీఎస్‌ఎఫ్‌ ఫాంలో ఐటెం నెం.11లో  వివరాలు ఇవ్వాలి.  అంటే రద్దు  చేయాలనుకుంటున్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని  జత చేయాలి.

ఆఫ్‌లైన్‌ ద్వారా పాన్‌ సరెండర్‌ చేయడం
ఆఫ్‌లైన్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్‌‌లో ఉన్న అధికారులకు అందజేయాలి. ఫారం 49ఎ అప్లికేషన్‌లో ఉన్న చివరి కాలమ్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి. ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో వారు అప్లికేషన్‌లో పూర్తి పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు వివరాలు పేర్కొనాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top