ఉద్యోగాలు పెరుగుతున్నాయ్! | Hiring up 22% in March, bullishness to continue: Naukri | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు పెరుగుతున్నాయ్!

Apr 13 2016 10:12 PM | Updated on Sep 3 2017 9:47 PM

ఉద్యోగాలు పెరుగుతున్నాయ్!

ఉద్యోగాలు పెరుగుతున్నాయ్!

ఐటీ సాఫ్ట్‌వేర్, ఐటీఈఎస్, టెలికాం, బీమా రంగాల దన్నుతో ఈ మార్చిలో ఉద్యోగ నియామకాల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్‌కామ్’ తెలిపింది.

మార్చిలో 22% వృద్ధి: నౌకరీ.కామ్
 

న్యూఢిల్లీ: ఐటీ సాఫ్ట్‌వేర్, ఐటీఈఎస్, టెలికాం, బీమా రంగాల దన్నుతో ఈ మార్చిలో ఉద్యోగ నియామకాల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్‌కామ్’ తెలియజేసింది. ఈ ధోరణి మున్ముందు కొనసాగుతుందని కూడా నౌకరీ పేర్కొంది. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ... గతేడాదితో పోలిస్తే ఈ మార్చిలో 1968కి చేరి 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఈ వృద్ధి 18 శాతంగా ఉంది. ఈ ఏడాది ఉద్యోగార్థులకు మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తోందని ఈ సందర్భంగా నౌకరీ ప్రధాన సేల్స్ అధికారి వి.సురేశ్ చెప్పారు.

 

గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో ఐటీ రంగంలో నిపుణులకు డిమాండ్ 25 శాతం పెరగ్గా... ఐటీఈఎస్‌లో ఇది 48 శాతంగా ఉందని, సేల్స్-బిజినెస్ డెవలప్‌మెంట్ నిపుణులకు కూడా డిమాండ్ బాగా పెరిగిందని ఆయన తెలియజేశారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉద్యోగాల వృద్ధిలో 50 శాతంతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా ముంబై(45 శాతం), చె న్నై(43) తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement