హైదరాబాద్‌లో తొలి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ | Hindustan Petroleum Corporation Limited (HPCL) Is Launching  EV Charging Station | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తొలి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌

Aug 2 2018 11:56 AM | Updated on Sep 5 2018 3:47 PM

Hindustan Petroleum Corporation Limited (HPCL) Is Launching  EV Charging Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరాల్లో కాలుష్యాన్ని నిర్మూలించి.. పర్యావరణ హితంగా మార్చడానికి.. కర్బన్‌ ఉద్గారాలను వెలువరించే వాహనాలను ప్రభుత్వాలు తగ్గించేస్తున్నాయి. వీటి స్థానంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ వాహనాలు నడవడం కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం తొలి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు అయింది. నేడు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను లాంచ్‌ చేసింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ లాంచింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. గ్రీన్‌ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, కార్బన్‌ డయాక్సైడ్‌ను తగ్గించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు హెచ్‌పీసీఎల్‌ తెలిపింది.

పైలెట్‌ బేసిస్‌లో తెలంగాణ వ్యాప్తంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు హెచ్‌పీసీఎల్‌ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ తన ఇన్‌-హౌజ్‌ నిపుణుల సహకారంతో అభివృద్ధి చేసింది. గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ 2015లో ఏర్పాటు చేసింది. ఈ-రసీదుల సౌకర్యంతో ఆటోమేషన్‌ను ఇది కలిగి ఉంది. ఇంధన కొనుగోలు చేసిన కస్టమర్లు వెంటనే ఎస్‌ఎంఎస్‌లు పొందేలా కూడా హెచ్‌పీసీఎల్‌ దీన్ని రూపొందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రోత్సహకాలను, మౌలిక సదుపాయాలను అందించనున్నట్టు అంతకముందే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగం కోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సివసరం కూడా ఉందని తెలిపింది.
 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement