ఆటుపోట్లలోనూ స్థిరమైన రాబడులు | HDFC Balanced Fund | Sakshi
Sakshi News home page

ఆటుపోట్లలోనూ స్థిరమైన రాబడులు

Mar 26 2018 2:02 AM | Updated on Mar 26 2018 2:02 AM

HDFC Balanced Fund - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ అంటేనే తీవ్ర హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు!!. ఈ తరహా పరిస్థితులు నచ్చని వారు ఒకింత స్థిరత్వంతో కూడిన పెట్టుబడి సాధనాల వైపు చూస్తారు. అలాంటి వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ఒకటి. ఇది పూర్తిగా ఈక్విటీ మార్కెట్‌పై ఆధారపడే పథకం కాదు. అలాగని అధిక రాబడులిచ్చే ఈక్విటీకి దూరంగానూ ఉండదు. అటు ఈక్విటీ రాబడులు, ఇటు డెట్‌ (బాండ్లు) నిలకడను కలిపి ఇన్వెస్టర్ల పెట్టుబడులపై స్థిరమైన రాబడులను అందించే దిశగా ఇది పనిచేస్తుంది. పథకం నిర్వహణ పరిధిలోని మొత్తం పెట్టుబడుల్లో 35 శాతం వరకు డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

పెట్టుబడుల విధానం, పనితీరు
2011, 2013, 2015, 2016 సంవత్సరాల్లో మార్కెట్ల అస్థిరత సమయాల్లో పోటీ పథకం హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్‌ ఫండ్‌తో పోలిస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ మెరుగైన రాబడులను అందించింది. కారణం ఆయా సమయాల్లో ఈక్విటీ పెట్టబడులను సాధ్యమైనంత తక్కువ స్థాయికి పరిమితం చేయడం వల్లే. 2014, 2017లో మార్కెట్‌ ర్యాలీల్లోనూ చక్కని రాబడులను అందించింది. మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా అధిక రాబడులను పంచింది.

2014లో ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం వరకు స్మాల్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌నే కొనసాగించింది. అలాగే, అదే ఏడాది ప్రభుత్వ సెక్యూరిటీలకు తగినంత నిధులు కేటాయించడం ద్వారా డెట్‌ విభాగంలోనూ మెరుగైన రాబడులను రాబట్టింది. ఇటీవలి కాలంలో బాండ్‌ ఈల్డ్స్‌ 6.6 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిపోవడం, తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు తగ్గించుకుని కార్పొరేట్‌ బాండ్లకు పెట్టుబడులను మళ్లించింది.

ఇక ఇటీవలి ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిలో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుంది. తాజాగా వీటిలో కేవలం 11 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. ఈ విధమైన పెట్టుబడి వ్యూహలను అనుసరించడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ఈ కేటగిరీకి మించి ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో అధిక రాబడులను అందించింది.

ఈ రంగాలకు ప్రాధాన్యం
బ్యాంకింగ్‌ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన షేర్లలో 20 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులు, సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగాల పట్ల కూడా ఆశావహంగా ఉంది. ఏడాది కాలంలో ఈ పథకం 15.4 శాతం రాబడి అందించింది. మూడేళ్ల కాలంలో 10.1 శాతం, ఐదేళ్ల కాలంలో 18.4 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది.

టాప్‌ హోల్డింగ్స్‌
స్టాక్‌ పేరు                     పెట్టుబడుల శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు           6.57
ఇన్ఫోసిస్‌                         3.97
హెచ్‌డీఎఫ్‌సీ                     3.50
ఐసీఐసీఐ బ్యాంకు              3.40
ఐటీసీ                             3.30
ఎల్‌అండ్‌టీ                      3.15
అరబిందో ఫార్మా                    2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement