జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు | GVK Power Q4 loss widens to Rs 408 cr | Sakshi
Sakshi News home page

జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు

May 21 2016 2:46 AM | Updated on Sep 4 2017 12:32 AM

జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు

జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు

మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర నష్టాలు అధికమయ్యాయి.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర నష్టాలు అధికమయ్యాయి. ఈ కాలంలో నికర నష్టం రూ.407 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.108 కోట్లు నమోదైంది. టర్నోవర్ రూ.846 కోట్ల నుంచి రూ.1,081 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరానికి   నికర నష్టం రూ.834 కోట్ల నుంచి రూ.934 కోట్లకు పెరిగింది. టర్నోవరు రూ.3,049 కోట్ల నుంచి రూ.4,164 కోట్లుగా ఉంది. గ్యాస్ సరఫరా సరిగా లేక ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడవకపోవడం నష్టాలకు దారి తీసిందని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement