
కోలకతా: ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది.
గువహటికి వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్నకొన్నినిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగానికి సమాచారం అందించారని తెలిపారు. పొగలను గుర్తించినట్టు చెప్పారు.
అయితే పైలట్ అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు, సిబ‍్బందితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.