బ్యాంకులకు రూ .80,000 కోట్లు | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు రూ .80,000 కోట్లు

Published Thu, Jan 4 2018 8:40 PM

Govt gets Lok Sabha approval for Rs 80,000 crore PSBs recapitalisation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కింద రూ 80,000 కోట్ల నిధులను అందించాలన్న ప్రతిపాదనకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. మొండి బాకీలు, రుణ డిమాండ్‌ తగ్గుదలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా నిధుల సాయం అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

బాండ్ల ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు రూ 80,000 కోట్లు అదనందగా వెచ్చించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండేళ్ల వ్యవధిలో బ్యాంకులకు రూ 1.35 లక్షల కోట్ల మూలధనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు జూన్‌ 2017 నాటికి  విపరీతంగా పెరిగి రూ 7.33 లక్షల కోట్లకు ఎగబాకాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement