టెలికం రంగాన్ని ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్‌ | Government Supports Telecom Sector Says By Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

టెలికం రంగాన్ని ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్‌

Nov 16 2019 12:29 PM | Updated on Nov 16 2019 1:13 PM

Government Supports Telecom Sector Says By Nirmala Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో విలేకర్ల సమావేశం సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు.నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు.  టెలికం నష్టాలకు  సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

మరోవైపు టెలికం సంక్షోభాన్ని ప్రభుత్వం పట్టించుకోకుంటే భారత్‌లో పెట్టుబడుల పెట్టే విషయంలో పునరాలోచిస్తామని వొడాఫోన్‌ సీఈఓ నిక్‌ రెడ్‌ అన్నారు. ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది.  

ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement