గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

Published Wed, Oct 10 2018 12:30 PM

Google Pixel 3 and 3 XL announced with bigger screens - Sakshi

న్యూయార్క్‌: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో  లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. భారీ డిస్‌ప్లే విత్‌ నాచ్‌,  టాప్ షాట్  ఫీచర్‌తో అద్భుతమైన  కెమెరాలు ప్రధాన ఫీచర్లు అని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా వైర్‌లెస్‌(10 వాట్స్‌) చార్జర‍్లను జోడించింది.

పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫోన్లు క్లియర్లీ వైట్, జస్ట్ బ్లాక్, నాట్ పింక్ రంగుల్లో మాత్రమే లభిస్తున్నాయి. వీటితోపాటు గూగుల్ పిక్సల్ యూఎస్‌బీ టైప్ సి ఇయర్ బడ్స్‌ను బాక్స్‌లో అందిస్తున్నారు. పిక్సల్ కొత్త ఫోన్లకు ప్రీ ఆర్డర్లు అమెరికా మార్కెట్‌లో ఇప్పటికే ప్రారంభం కాగా, భారత్‌లో  రేపటి నుంచి ఈ ఫోన్లకు  ప్రారంభమవుతాయి. అలాగే భారత్‌లో నవంబర్ 1వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

ఇక లాంచింగ్‌ ఆఫర్‌ విషయానికి వస్తే.. పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో వీటికి 50 శాతం బైబ్యాక్ ఆఫర్. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో అదనంగా మరో రూ.5వేల డిస్కౌంట్ ఇస్తారు.  దీంతోపాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో   రూ.4వేల అదనపు రాయితీ కూడా ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ  కామన్‌గా  ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0,  12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా ఉంచింది.
 

గూగుల్ పిక్సల్ 3 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
1080 x 2160 స్క్రీన్ రిజల్యూషన్
 2915 ఎంఏహెచ్ బ్యాటరీ

గూగుల్‌ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు
6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
3430 ఎంఏహెచ్ బ్యాటరీ,
 

Advertisement
 
Advertisement
 
Advertisement