గర్ల్‌ఫ్రెండ్‌ కోసం దొంగగా మారిన గూగుల్‌ ఉద్యోగి

Google Employee Held For Theft For Girlfriend's Expenses - Sakshi

గర్ల్‌ఫ్రెండ్‌ను బయటికి తీసుకెళ్లినప్పుడు, పరువు పోకుండా ఖర్చులన్నీ తామే పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలు. ఈ కోవలోనే ఆలోచించాడు ఓ గూగుల్‌ ఉద్యోగి. కానీ తన జేబులో డబ్బులు లేకపోవడంతో, ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్‌ ఖర్చుల కోసం దొంగగా మారిని ఈ గూగుల్‌ ఉద్యోగి చిట్టచివరికి కటకటాల పాలయ్యాడు. గర్విత్ సాహ్ని అనే 24 ఏళ్ల ఇంజనీర్‌. అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్‌ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఇతను హర్యానా అంబాలా జిల్లాకు చెందిన వాడు. 

సెప్టెంబర్‌ 11న ఐబీఎం మల్టినేషనల్‌ టెక్నాలజీ కంపెనీల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఆ అనంతరం తాజ్‌ ప్యాలెస్‌లో మీడియాతో సమావేశమైంది. ఆ కాన్ఫరెన్స్‌ సందర్భంగా దివ్యాని జైన్‌ అనే ఉద్యోగిని హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.10వేల దొంగలించబడ్డాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, హోటల్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్‌ చేశారు‌. ఆ కెమెరా ఫుటేజీల్లో, నిందితుడు క్యాబ్‌లో హోటల్‌ రూమ్‌కు వచ్చినట్టు తెలిసింది. దాని నెంబర్‌ ద్వారా క్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను, మొబైల్‌ నెంబర్‌ను గుర్తించారు. అయితే నిందితుడు అప్పటికే తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. కానీ పోలీసులు అతని కొత్త మొబైల్‌ నెంబర్‌ను కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లోనే గర్విత్ సాహ్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా ఆర్థికంగా తాను చాలా నష్టాల్లో ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్‌ ఖర్చుల కోసం మనీ కూడా లేవని సాహ్ని చెప్పాడు. అతని నుంచి రూ.3000ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top