దిగొచ్చిన బంగారం ధర | Gold Prices Fall By Rs 220 To Rs 31650 | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన బంగారం ధర

Oct 9 2018 8:31 PM | Updated on Oct 9 2018 8:53 PM

Gold Prices Fall By Rs 220 To Rs 31650 - Sakshi

న్యూఢిల్లీ : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధర దిగొస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర బులియన్‌ మార్కెట్‌లో 220 రూపాయలు తగ్గి, రూ.31,650గా నమోదైంది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గడంతో, బంగారం ధర పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా క్షీణించింది. కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి, రూ.39,250గా నమోదైంది.పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. 

రూపాయి పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గుతున్నట్టు తెలిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 1.39శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి కూడా 2.39శాతం తగ్గి ఔన్సు 14.38 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.220 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.31,6500గా, రూ.31,500గా నమోదయ్యాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement