ఆభరణాల రంగం ‘మెరుపు’ తగ్గుతుందా? | Sakshi
Sakshi News home page

ఆభరణాల రంగం ‘మెరుపు’ తగ్గుతుందా?

Published Tue, Jun 19 2018 1:45 AM

Gold fails to act as safe haven - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, అధిక ధరలు వెరసి సమీప కాలంలో ఆభరణాల రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వల్ల  అంతర్జాతీయ పసిడి ధర తగ్గినా,  ఆ ప్రభావం దేశీయంగా ఉండదన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కేర్‌ రేటింగ్స్‌ విడుదల చేసిన అంశాల్లో ముఖ్యమైనవి...
సమీప భవిష్యత్తులో రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పరిశ్రమలో ఎగుమతులు తగ్గుతున్నాయి.
ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం కూడా కనిపిస్తోంది. చైనా ఇటీవల ఆభరణాలపై దిగుమ తి సుంకాలను తగ్గించింది. అవకాశాలను వినియోగించుకుంటే, దేశీయ పరిశ్రమకు ఇది ఒక సానుకూల అంశం.   2018 మే నెలలో ఈ రంగం ఎగుమతుల్లో అసలు వృద్దిలేకపోగా, 11 శాతం క్షీణత నమోదయ్యింది. 

Advertisement
Advertisement