హైదరాబాద్‌లో గోద్రెజ్‌ ‘సోషల్‌ ఆఫీస్‌’ | Godrej Interio expanding in South India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గోద్రెజ్‌ ‘సోషల్‌ ఆఫీస్‌’

Feb 21 2020 6:07 AM | Updated on Feb 21 2020 6:07 AM

Godrej Interio expanding in South India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫర్నీచర్‌ రంగ సంస్థ గోద్రెజ్‌ ఇంటీరియో దక్షిణాదిన తొలి ‘సోషల్‌ ఆఫీస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కొండాపూర్‌లో 4,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో కార్యాలయాలకు అవసరమయ్యే అత్యాధునిక ఫర్నీచర్‌ అందుబాటులో ఉంటుందని గోద్రెజ్‌ ఇంటీరియో సీవోవో అనిల్‌ మాథుర్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇప్పటికే ముంబై, కోల్‌కతలో ఇటువంటి సెంటర్లను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బెంగళూరు, పుణే, చెన్నై, చండీగఢ్‌లోనూ తెరవనున్నాం. రెండు మూడేళ్లలో ఈ విభాగం నుంచి రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. గోద్రెజ్‌ ఇంటీరియో 2018–19లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,400 కోట్లు, 2020–21లో రూ.3,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement