రూ.599కే గోఎయిర్‌ టికెట్‌! | GoAir ticket Rs .599! | Sakshi
Sakshi News home page

రూ.599కే గోఎయిర్‌ టికెట్‌!

May 13 2017 12:49 AM | Updated on Sep 5 2017 11:00 AM

రూ.599కే గోఎయిర్‌ టికెట్‌!

రూ.599కే గోఎయిర్‌ టికెట్‌!

విమానయాన సంస్థ ‘గోఎయిర్‌’ తాజాగా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రూ.599 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘గోఎయిర్‌’ తాజాగా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రూ.599 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది.

డిస్కౌంట్‌ ఆఫర్‌ మే 12 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. నిజానికి గో ఎయిర్‌ దేశవ్యాప్తంగా 23 రూట్లలో విమానాలను ఆపరేట్‌ చేస్తోంది. ఆఫర్‌ మే 12న ఆరంభమైందని... 15 అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement