మీ ఇంటికే మెకానిక్‌

Go Mechanic Startup Company Special Story - Sakshi

కార్‌ అయినా బైక్‌ అయినా నడిచినంత కాలం పర్లేదు. కాని ఆగిందంటే నరకమే అంటారు వాహన చోదకులు. సరైన సర్వీసింగ్‌ సెంటర్‌ దొరకక, దొరికిన సర్వీసింగ్‌పై సందేహాలు తీరక... వాహన యజమానులు కష్టాలకూ ఓనర్స్‌అనిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచే ఓ యువ టీమ్‌ సృష్టించింది గో మెకానిక్‌ స్టార్టప్‌.

సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో కార్లు వినియోగించేవాళ్లు కేవలం అందానికి, సాంకేతిక విశేషాలకు మాత్రమే కాకుండా నాణ్యమైన విక్రయానంతర సేవలకూ అధిక ప్రాధాన్యం ఇస్తారు.  ఆ సేవలు సైతం తమకు వీలైనంత సమీపంలో ఉండాలని కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆథరైజ్డ్‌ సేవలకూ, లోకల్‌ వర్క్‌షాప్స్‌కు మధ్య సర్వీసింగ్‌ తో పాటు ధరల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ ఖాళీని పూర్తి చేయడానికే  టెక్నాలజీని అనుసంధానించిన కార్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ నెట్‌వర్క్‌గా గో మెకానిక్‌ను అందుబాటులోకి తెచ్చామంటున్నారు అమిత్‌ భాసిన్, రిషబ్‌ కర్వా, కుశాల్‌ కర్వా, నితిన్‌ రానాలు. ఢిల్లీకి చెందిన ఈ యువ బృందం ఇటీవలే నగరానికీ తమ సేవల్ని విస్తరించిన సందర్భంగా పంచుకున్న విశేషాలు..

అనుభవం చూపిన పరిష్కారం..
నేను చెవర్లెట్‌ తీసుకున్నప్పుడు పలు వర్క్‌షాప్స్‌కి తిరిగి రూ.2వేల నుంచి రూ.20వేల వరకూ సమర్పించుకుంటూ ఉండేవాడినని (భాసిన్‌). అప్పటికీ తన కార్‌కు సంబంధించిన అసలు సమస్య ఏమిటనేది తెలీలేదు.. ఇలాంటి సందర్భాల్లో ఆథరైజ్డ్‌ సెంటర్‌కి వెళ్లి అధిక మొత్తం చెల్లించుకోవడం లేదా లోకల్‌ వర్క్‌షాప్‌లో మంచి సర్వీసింగ్‌ దొరకాలని భగవంతుడ్ని ప్రార్థించడం....  వినియోగదారుల ముందు రెండే ఆప్షన్లు ఉంటాయి.  ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులాగా నాణ్యమైన సేవలనూ లోకల్‌ వర్క్‌షాప్‌ తరహాలో అందుబాటు ధరలనూ మేళవించడమే దీనికి పరిష్కారం అనిపించింది. 

ఎలా పనిచేస్తుందంటే...
ఫ్రాంఛైజీ ఓన్డ్‌ కంపెనీ ఆపరేటెడ్‌ (ఎఫ్‌ఓసీఓ)మోడల్‌లో గో మెకానిక్‌ పనిచేస్తుంది. కస్టమర్‌ ఇంటి నుంచే కార్‌ తీసుకెళ్లి మరమ్మతు పూర్తి చేశాక తిరిగి ఇంటికి భద్రంగా చేరుస్తుంది   కార్‌ని ఇచ్చిన దగ్గర్నుంచి అది తిరిగి వచ్చేవరకూ  దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఆటోమేటెడ్‌ మెసేజెస్‌ కస్టమర్‌కి వెళ్తుంటాయి. మరమ్మతు ధరల్లో పారదర్శకత...తీసుకురావాలనేదే మా ఆలోచన ఏ స్పేర్‌ పార్ట్‌కైనా రీప్లేస్‌మెంట్‌ చేసేలా...వేలాదిగా స్పేర్‌ పార్ట్స్, మా కస్టమర్లు అందరికీ  సర్వీస్‌పార్ట్‌నర్స్‌ ద్వారా ప్రీ ఫిక్స్‌డ్‌ ప్రైసింగ్‌ ఉంటుంది. వారంటీ అనంతరం ప్రతి కారుకీ తప్పని ఈ రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 8 నుంచి 10 బిలియన్లు ఉంటుందని మా అంచనా.మా స్టార్టప్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సహా  అరడజను నగరాల్లో సేవలు అందిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top