జనరల్ మోటార్స్ భారీ డిస్కౌంట్స్ | General Motors Company given Discounts on Car sales | Sakshi
Sakshi News home page

జనరల్ మోటార్స్ భారీ డిస్కౌంట్స్

Dec 6 2014 12:31 AM | Updated on Aug 14 2018 4:01 PM

జనరల్ మోటార్స్ భారీ డిస్కౌంట్స్ - Sakshi

జనరల్ మోటార్స్ భారీ డిస్కౌంట్స్

జనరల్ మోటార్స్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

రూ.55,000 నుంచి రూ.85,500 రేంజ్‌లో

చెన్నై: జనరల్ మోటార్స్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. క్యాప్టివా ఎస్‌యూవీ మినహా ఇతర కార్లపై రూ.55,000 నుంచి రూ.85,500 వరకూ డిస్కౌంట్‌ను ఇస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేశ్ సింగ్ చెప్పారు. నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్/లాయల్టీ బోనస్, కార్పొరేట్ బోనస్‌ల రూపంలో ఈ డిస్కౌంట్లను అందిస్తామని వివరించారు.

సెయిల్ సెడాన్,  షెవర్లే తవేర పై రూ.55,000, షెవర్లే క్రూజ్‌పై రూ.60,000, షెవర్లే స్పార్క్‌పై రూ.68,000, బీట్ మోడల్‌పై రూ. 83,000, షెవర్లే ఎంజాయ్‌పై రూ.85,500 చొప్పున డిస్కౌంట్లనందిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 255 సేల్స్ అవుట్‌లెట్లు, 272 సర్వీస్ అవుట్‌లెట్‌ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తున్నా మని.. ఈ ఆఫర్ పరిమితకాలమే అందుబాటులో ఉంటుందని రాజేశ్‌సింగ్   తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement