మరోసారి వార్తల్లో రాజన్‌

FT lists Raghuram Rajan as a candidate for top post at Bank of England - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్  గుర్తున్నారా? ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్‌ పేరు  మళ్లీ వార్తల్లో నిలిచింది.  బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ అందించిన  సమాచారం   ప్రకారం  బీఓఈ  గవర్నర్‌ పదవి రేసులో రాజన్‌ పేరు  ప్రముఖంగా  వినిపిస్తోంది.  చికాగోకి చెందిన ఎకనామిస్ట్ , రఘురామ్ రాజన్‌  టాప్‌లిస్ట్‌లో ఉన్నారని నివేదించింది.  ఆర్‌బీఐ గవర్నర్‌గా తనదైన ముద్ర వేసుకున్న రఘురామ్‌ రాజన్‌ బ్రెక్సిట్ కోసం దేశం సిద్ధపడుతున్న సమయంలో  ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్  ఇంగ్లండ్‌ గవర్నర్  రేసులో..అదీ టాప్‌లో వుండటం విశేషం.

ప్రస్తుతం బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది.  ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న  రఘురామ్ రాజన్  పేరు పరిశీలనలో ఉందిట. ఈ పదవిని చేపట్టటానికి అవసరమైన ప్రాసెస్ ను ప్రారంభించినట్లు  యూకే ఛాన్సెలర్ ఫిలిఫ్ హమోండ్ తెలిపారని ఎఫ్‌టీ రిపోర్ట్‌ చేసింది.   అంతేకాదు  ఈ లిస్ట్ లో భారత్ కు చెందిన మరో వ్యక్తి స్రితి వదేరా పేరు కూడా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top