
పిల్లలకు ఉచితంగా విమాన టికెట్లు
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎయిరిండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన తమ విమానాల్లో ప్రయాణించే పిల్లలకు ఆ తర్వాత ఓ డ్రా నిర్వహించి, అందులో విజేతలకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వనున్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎయిరిండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన తమ విమానాల్లో ప్రయాణించే పిల్లలకు ఆ తర్వాత ఓ డ్రా నిర్వహించి, అందులో విజేతలకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వనున్నారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి సాధించిన వాళ్లకు ఢిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో- ఢిల్లీ మార్గంలో వెళ్లేందుకు నాలుగు ఎకానమీ టికెట్లు ఇస్తారు. రెండో బహుమతి సాధించినవాళ్లకు నాలుగు ఉచిత స్వదేశీ రిటర్న్ టికెట్లు ఇస్తారు. మూడో బహుమతి సాధించిన వాళ్లకు ఒక డొమెస్టిక్ సెక్టార్ టికెట్‌పై నాలుగు అప్‌గ్రేడ్ ఓచర్లు ఇస్తారు.
ఈ ఆఫర్ 12 ఏళ్ల లోపు వయసున్న వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ డ్రా తీస్తారు. పిల్లలు తమ ప్రయాణ వివరాలను ఎయిరిండియా కార్యాలయానికి నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు నవంబర్ 14న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసే పిల్లలకు ప్రత్యేకంగా స్వీట్లు, బొమ్మలు కూడా ఇవ్వనున్నారట.