ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌.. ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’ | Ford India Launches The EcoSport 'Platinum' Edition At Rs. 10.39 Lakh | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌.. ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’

Jan 20 2017 1:10 AM | Updated on Sep 5 2017 1:37 AM

ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌.. ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’

ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌.. ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్‌’ తాజాగా తన పాపులర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘ఎకోస్పోర్ట్‌’లో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ప్రారంభ ధర రూ.10.39 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్‌’ తాజాగా తన పాపులర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘ఎకోస్పోర్ట్‌’లో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌  ‘ప్లాటినమ్‌ ఎడిషన్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.39 లక్షలు–రూ.10.69 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త కారు రెండు ఇంజిన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ లీటర్‌కు 22.27 కిలోమీటర్ల మైలేజ్‌ను.. 1.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ లీటర్‌కు 18.88 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.10.39 లక్షలుగా, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.10.69 లక్షలుగా ఉందని తెలిపింది. ఇందులో డ్యూయెల్‌ టోన్‌ ఇంటీరియర్‌ డిజైన్, బ్లాక్‌ రూఫ్, 17 అంగుళాల పెద్ద వీల్స్, శాటిలైట్‌ నావిగేషన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, రియర్‌ వ్యూ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement