ఫ్లిప్‌కార్ట్‌ ‘సూపర్ర్‌ సేల్‌’ : ఆకర్షణీయమైన డీల్స్‌

Flipkart Superr Sale: Discounts On Best Selling Smartphones, TVs - Sakshi

బెంగళూరు : బిగ్‌ ఫ్రీడం సేల్‌ ముగిసిన రెండు వారాల్లోనే దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు తెరలేపబోతుంది. ‘సూపర్ర్‌ సేల్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని నిర్వహిస్తోంది. లోయల్టి ప్రొగ్రామ్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌’ లాంచ్‌ చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సేల్‌ ఇదే. ప్లస్‌ సభ్యులకు ఈ సేల్‌ త్వరగా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సేల్‌ లైవ్‌లోకి వస్తుండగా.. ప్లస్‌ సభ్యులకు ఆగస్టు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ప్రకటిస్తుంది. 

రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌కు వస్తుంది. టెలివిజన్‌ సెట్లపై, హెచ్‌పీ, ఆసుస్‌, డెల్‌, ఏసర్‌ వంటి ల్యాప్‌టాప్‌ బ్రాండ్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లపై కొనుగోలుదారుడు అదనంగా 2వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్‌, ఎల్‌జీ, వర్‌పూల్‌ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లపై 30 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీతో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్యాషన్‌, ఫర్నీచర్‌ వస్తువులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులకు కాస్త ముందుగా ఈ సేల్‌ అందుబాటులోకి రావడమే కాకుండా.. ఉచితంగా, త్వరగా డెలివరీ చేసే సామర్థ్యం, ప్రియారిటీ కస్టమర్‌ సపోర్టు లభించనున్నాయి. తన వెబ్‌సైట్‌పై వెచ్చించే ప్రతి 250 రూపాయలకు ఒక కాయిన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేయనుంది. ఒక్క లావాదేవీల్లోనే 2500 రూపాయల వరకు డిస్కౌంట్‌ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ సభ్యులు ఈ 10 కాయిన్లను వాడుకోవచ్చు. ప్లస్‌ సభ్యులకు పలు ఉచిత ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తుంది. ఈ ఆఫర్లలో గానా ప్లస్‌కు 6 నెలల సబ్‌స్క్రిప్షన్‌, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి రూ.550 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌,  బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి వంద రూపాయల తగ్గింపు ఉన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top