ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ధమాకా | Flipkart Festive Dhamaka Days Sale to Kick Off on October 24 | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ధమాకా

Oct 19 2018 3:10 PM | Updated on Oct 19 2018 3:10 PM

Flipkart Festive Dhamaka Days Sale to Kick Off on October 24 - Sakshi

సాక్షి, ముంబై: వరుస పండుగలతో  ఈకామర్స్  సంస్థలు ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు  సిద్ధమైపోయాయి. దసరా సీజన్‌ను బాగా  క్యాష్‌  చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌ ఇపుడికి దీపావళి అమ‍్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో  'ఫెస్టివ్ ధమాకా డేస్' పేరుతో దీపావళి సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది.  ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70శాతం  వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.  దీపావళి అమెజాన్ వచ్చే వారం మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి గమనార్హం.

బిగ్ బిలియన్ డేస్ సేల్‌ మాదిరిగా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్‌లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డెలివరీ, కస్టమర్ కేర్ లలో ప్రాధాన్యతతో పాటు అదనంగా రివార్డ్ పాయింట్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement