వాటితోనే ఆపిల్‌కు భారీ రెవెన్యూలు

Flipkart, Amazon help Apple double revenue in India - Sakshi

ఆపిల్‌ రెవన్యూలు భారత్‌లో దంచికొట్టాయి. శుక్రవారం ప్రకటించిన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో ఆపిల్‌ భారత్‌ రెవెన్యూలు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా నమోదయ్యాయి. ఈ రెవెన్యూలకు ప్రధాన కారణం ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎంలపై నమోదైన భారీ మొత్తంలో విక్రయాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకున్న ఫెస్టివల్‌ సీజన్‌లో ఈ-కామర్స్‌ ప్లేయర్లు భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో ఐఫోన్‌ విక్రయాలు పెరిగినట్టు తెలిపారు.. గ్రేటర్‌ చైనాకు బయట ఎమర్జింగ్‌ మార్కెట్‌లలో ఆపిల్‌ రెవెన్యూలు 40 శాతం పైకి ఎగిశాయి. వీటిలో ఎక్కువగా భారత్‌లో ఏడాది ఏడాదికి రెండింతలు పైగా రెవెన్యూలు నమోదైనట్టు కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. అదేవిధంగా ఐప్యాడ్‌ టాబ్లెట్స్‌, మ్యాక్‌ కంప్యూటర్ల విక్రయాలు కూడా భారత్‌లో రెండంకెలు నమోదుచేసినట్టు పేర్కొన్నారు. ఐప్యాడ్‌ సేల్స్‌ 39 శాతం పైకి ఎగిశాయన్నారు. భారత ఆదాయాల్లో ఎక్కువ భాగం ఐఫోన్‌ అమ్మకాల నుంచే వచ్చాయని తెలిపారు. 

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఏడాది ఏడాదికి ఆపిల్‌ రెవెన్యూలు 142 శాతం పెరిగాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఈ క్వార్టర్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకున్న ఫెస్టివల్‌ సీజన్‌లో ఈ-కామర్స్‌ ప్లేయర్లు భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో ఐఫోన్‌ విక్రయాలు పెరిగినట్టు పేర్కొంది. ఆపిల్‌ ఇండియాకు ఇది రికార్డు మూడో క్వార్టర్‌ అని, సాధారణంగా త్రైమాసికాల్లో అమ్మకాలు తక్కువగా ఉంటాయని, కానీ ఈ క్వార్టర్‌లో పాత తరానికి చెందిన ఐఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పథక్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లకు భారత్‌ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉంది. 110 మిలియన్‌-ఆడ్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రతేడాది రవాణా జరుగుతుండగా.. వాటిలో 3 శాతం ఆపిల్‌ కంపెనీవే. తాజాగా ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌తో ఆపిల్‌ గ్లోబల్‌ ఎక్కువ మొత్తంలో విక్రయాలను నమోదైచేయనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top