పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్! | Festive season proves a mixed bag for retailers | Sakshi
Sakshi News home page

పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్!

Oct 19 2016 1:11 AM | Updated on Sep 2 2018 4:03 PM

పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్! - Sakshi

పండుగ సీజన్లో రిటైల్ అమ్మకాలు 50% అప్!

షాపింగ్ మాల్స్‌లోని రిటైలర్లు ఈ పండుగ సీజన్‌లో వాటి అమ్మకాల్లో 45-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తునట్లు పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది.

న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లోని రిటైలర్లు ఈ పండుగ సీజన్‌లో వాటి అమ్మకాల్లో 45-50 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తునట్లు పరిశ్రమ సమాఖ్య అసోచామ్ పేర్కొంది. సులభ రుణ సదుపాయం, వివిధ ఆఫర్లు, పలు డిస్కౌంట్లు వంటి అంశాలు విక్రయాల పెరుగుదలకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా రిటైలర్లు కూడా వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి పలు పట్టణాల్లోని రిటైలర్లు ఇప్పటికే వాటి అమ్మకాల్లో పెరుగుదల ప్రారంభమైనట్లు పేర్కొన్నారని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement