రూపీ .. రికవరీ.. 

 Fed just proposed a plan to make life easier for banks  - Sakshi

ముంబై: జీడీపీ గణాంకాలు మెరుగ్గా ఉండగలవన్న ఆశావహ అంచనాల నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే 43 పైసలు పెరిగి 67.43 వద్ద క్లోజయ్యింది. ఎగమతిదారులు, కార్పొరేట్‌ సంస్థలు .. డాలర్లకు సంబంధించి లాంగ్‌ పొజిషన్స్‌ నుంచి వైదొలగడం కూడా ఇందుకు తోడ్పడింది.

అటు డాలర్‌ బలహీనపడటం కూడా రూపాయి రికవరీకి కలిసొచ్చింది. 2017–18 మార్చి త్రైమాసికం, పూర్తి ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభు త్వం గురువారం విడుదల చేయనుంది. మూడో త్రైమాసికంలో 7.2% వృద్ధి రేటుతో భారత్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా నిల్చిన సంగతి తెలిసిందే.  

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top