ఫేస్‌బుక్‌ పోస్ట్‌లపై చెత్త కామెంట్లకు చెక్‌

Facebook starts testing downvote button - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో:  ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం  ఫేస్‌బుక్‌  కొత్త  ఫీచర్‌ను లాంచ్‌ చేసేందుకు  సిద్ధమవుతోంది.  ఫేస్‌బుక్‌లో అసంబద్ధ వ్యాఖ్యలు, అబ్యూసివ్‌  వ్యాఖ్యలతో ఇబ్బందులు పడే  వినియోగదారుల సౌలభ్యం కోసం ‘డౌన్‌ వోట్‌ ’ అనే ఫీచర్‌ను టెస్ట్‌  చేస్తోంది.  ఫేస్‌బుక్‌  పోస్ట్‌లపై వినియోగదారులకు ప్రతికూల స్పందనను నమోదు చేసే ఒక లక్షణాన్ని పరీక్షిస్తోంది. అయితే  చాలామంది ఫేస్‌బుక్‌ వినియోగదారులకు  ఆశిస్తున్నట్టుగా డిజ్‌లైక్‌ బటన్‌లా కాకుండా సరికొత్తగా దీన్ని పరీక్షిస్తోంది.

ఫేస్‌బుక్‌ యూజర్లను ఇబ్బంది పెట్టే  కామెంట్‌పై  సంబంధిత  యూజర్లు డౌన్‌వోట్‌ బటన్‌ క్లిక్‌ చేసినపుడు  ఆ వ్యాఖ్య ప్రమాదకరమైందా, తప్పుదోవ పట్టించేదా, లేదా టాపిక్‌తో సంబంధం లేనిదా  చెప్పమని అడుగుతుంది. అనంతరం ఆ కామెంట్లు మిగతా యూజర్లకు కనిపించకుండా చేస్తుంది. యూజర్ల పోస్ట్‌లపై అవాంఛనీయమైన కామెంట్లకు మాత్రమే ఇది ఉద్దేశించిందని  ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  ఈ విషయాన్ని ధృవీకరించిన సంస్థ  ప్రస్తుతం అమెరికాలో  చాలా కొద్దిమందిపై ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. పబ్లిక్ పోస్టులపై వ్యాఖ్యలపై  ఫీడ్‌ బ్యాక్‌ కోసం దీన్ని పరీక్షిస్తున్నట్టు చెప్పింది. 

కాగా 2009 లో లైక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చినపుడు డిజ్‌లైక్‌ బటన్‌ కూడా చేర్చాలని యూజర్లు కోరుకున్నారు. అయితే 2016లో రియాక్షన్‌ ఎమోజీలను (ప్రేమ, నవ్వు, ఆశ్చర్యం, విచారం లాంటి)  జోడించిన సంగతి తెలిసిందే.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top