చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌’ | EY launches GST helpdesk for small businesses | Sakshi
Sakshi News home page

చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌’

Jul 10 2017 12:52 AM | Updated on Sep 5 2017 3:38 PM

చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌’

చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌’

చిన్న వ్యాపారుల కోసం జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌ను ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ప్రారంభించింది.

న్యూఢిల్లీ: చిన్న వ్యాపారుల కోసం జీఎస్‌టీ హెల్ప్‌ డెస్క్‌ను ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ప్రారంభించింది. వ్యాపారులు తమ సందేహాలను ఆన్‌లైన్‌లోనే ఈ డెస్క్‌ సాయంతో తొలగించుకోవచ్చు. 14 పట్టణాలకు చెందిన 800 జీఎస్‌టీ పన్ను నిపుణులు ఉచిత సేవలు అందించనున్నారు.

చిన్న వ్యాపారులు, ట్రేడర్లు, వ్యాపారవేత్తలు జీఎస్‌టీకి సాఫీగా మారేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ తోడ్పడుతుందని ఈవై ఇండియా చైర్మన్‌ రాజీవ్‌మేమాని అన్నారు. తమ సందేహాలను, ప్రశ్నలను ‘ఈవై ఇండియా ట్యాక్స్‌ ఇన్‌సైట్‌’ యాప్, ‘డిజిజీఎస్‌టీ’ వెబ్‌సైట్, ‘ఈవై అండర్‌స్కోర్‌ ఇండియా’ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి  సమాధానాలు పొందొచ్చని ఈవై సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement