ఎస్కార్ట్స్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ వస్తోంది..!

ఎస్కార్ట్స్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ వస్తోంది..!


తొలి నమూనా ఆవిష్కరణ...

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ‘ఎస్కార్ట్స్‌’ తాజాగా తొలిసారి ఎలక్ట్రిక్, హైడ్రోస్టాటిక్‌ కాన్సెప్ట్‌ ట్రాక్టర్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. అలాగే ఫాంట్రాక్, పవర్‌ట్రాక్‌ బ్రాండ్ల కింద 22–90 హెచ్‌పీ శ్రేణిలో పలు ఉత్పాదనలతో తన ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. 70–90 హెచ్‌పీ శ్రేణిలోని న్యూ ఎస్కార్ట్స్‌ ట్రాక్టర్స్‌ సిరీస్, 22–30 హెచ్‌పీ శ్రేణిలోని కాంపాక్ట్‌ ట్రాక్టర్లు, క్రాస్‌ఓవర్‌ ట్రాక్టర్లు ఇందులో ఉన్నాయి. ఇవి టైర్‌–4 ఉద్గార నిబంధనలకు అనువుగా రూపొందాయి. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో విక్రయించొచ్చు. మెకానికల్‌ ట్రాక్టర్లు 2018 తొలి త్రైమాసికంలోనూ, హైడ్రోస్టాటిక్‌ ట్రాక్టర్లు 2018 రెండో త్రైమాసికంలోనూ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నవి. ఇక ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్ల అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని, తయారీ వెర్షన్‌ను 1–2 ఏళ్ల కాలంలో ఆవిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. కాంపాక్ట్‌ ట్రాక్టర్లను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేయనుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top